కాషాయ నేత వసూళ్ల దందాలు..!

161
bjp
- Advertisement -

పొద్దున లేస్తే దేశం కోసం…ధర్మం కోసం…నైతిక విలువలు, ప్రజలకు మా జీవితం అంకితం అంటూ బీజేపీ నేతలు నీతులు చెబుతారు..కాని చేసేవన్నీ అవినీతి పనులే..ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, వసూళ్ల దందాల్లో తమకు పోటీ ఎవరూ లేరని కాషాయ నేతలు నిరూపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి గెలిచిన కాషాయ కార్పొరేటర్లు తమ ఇలాకాలో వసూళ్ల దందాకు తెరలేపారు. ఎక్కడ ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంతిల్లు కట్టుకుంటే చాలు కాషాయ కార్పొరేటర్లు గద్దల్లా వాలిపోతున్నరు. అంతస్తుకు 2 లక్షలు చొప్పున ఎన్ని అంతస్తులు కడితే అన్ని 2 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నరు…పాపం వాళ్లు అంత ఇచ్చుకోలేమంటే..మా సంగతి మీకు తెల్వదు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆఖరకు సొంత బీజేపీ కార్యకర్తలను కూడా వదలడం లేదు. తాజాగా ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ పరిధిలో ఓ భవనం విషయంలో బీజేపీ మహిళా కార్పొరేటర్‌ సునీతా ప్రకాష్ గౌడ్ కుమారుడు సొంత పార్టీకి చెందిన ఓ వ్యక్తిని డబ్బుల కోసం బెదిరించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిక్‌మెట్ డివిజన్‌లో నైషధం సత్యనారాయణమూర్తి అనే కాషాయ పార్టీ సానుభూతిపరుడు మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు.

ఈ బిల్డింగ్‌‌పై స్థానిక బీజేపీ కార్పొరేటర్ సునీతా ప్రకాష్ గౌడ్ కుమారుడు తరుణ్ గౌడ్ కన్నుపడింది. వెంటనే సత్యనారాయణ మూర్తికి ఫోన్ చేసి రూ. 6 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసాడంట..ఏదో ఉన్నచిన్నపాటి స్థలంలో కట్టుకుంటున్నా కనికరించి వదిలేయండని సదరు భవన యజమాని మొరపెట్టుకోగా…..మీ స్థలం చిన్నదే కానీ, భవనం చాలా పెద్దగా నిర్మించారు. అంతస్తుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందే. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అంటూ తరుణ్‌గౌడ్ జవాబు ఇచ్చాడు. అయితే నేను బీజేపీ కార్యకర్తనే. మున్సిపల్‌ ఎన్నికల్లో మీకు ప్రచారం చేశాను. కుటుంబం మొత్తం బీజేపీకి ఓట్లు వేశాం. నేను ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు అడగడం భావ్యం కాదు అని ఫోన్‌లో మూర్తి చెప్పుకొచ్చారు. అవునా…మీరెక్కడా మాకు కనిపించలేదు. మమ్మల్ని ఇప్పుడు ఖుషీ చేయాల్సిందే అంటూ తరుణ్ గౌడ్ డిమాండ్ చేశాడు. అంతే కాదు వెంటనే మూర్తిని మ్యాటర్ సెటిల్ చేద్దాం మా ఆఫీసు రండని హుకుం జారీ చేశాడు. దీంతో ఆయన జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి బీజేపీ కార్పొరేటర్‌ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఇంటి నిర్మాణం విషయంపై తమకు ఆరున్నర లక్షలు ఇవ్వాలని కార్పొరేటర్‌ కుమారుడు మూర్తిని డిమాండ్ చేశారు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని, తన వద్ద లేవని మమ్మీతో మాట్లాడతానని, చివరగా మూడున్నర లక్షల వరకు తాను ఇస్తానని మూర్తి చెప్పడం వీడియోలో ఉంది. డబ్బుల విషయంలో ఏమైనా ఉంటే బాబుతో మాట్లాడుకోండి అంటూ కార్పొరేటర్‌ సమాధానం ఇవ్వడం, ‘మమ్మీ మాట్లాడదు, నేనే మాట్లాడుతా’ అని తరుణ్‌గౌడ్‌ చెప్పడం ఆ ఆడియోలో హాట్‌టాపిక్‌గా మారాయి.

‘నువ్వు చిన్న పిల్లాడివి. మమ్మీని రికెస్ట్‌ చేస్తా’ అని మూర్తి చెప్పగా.. తరుణ్‌గౌడ్‌ స్పందిస్తూ ‘నేను కిడ్‌ను కాదు. ఇమ్మెచ్యురిటీతో మాట్లాడడం లేదు. నాకు 31 సంవత్సరాలు. డబ్బులు ఇస్తే బిల్డింగ్‌ వద్దకు ఎవరినీ రాకుండా చూస్తా… అనడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తంగా బీజేపీ మహిళా కార్పొరేటర్ సునీతా ప్రకాష్ కుమారుడి అక్రమ వసూళ్ల దందాకు సంబంధించి ఆడియోలు, వీడియోలు బయటకు రావడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఇప్పుడు అవినీతి, అక్రమ దందాల్లో తమకు సాటెవ్వరు లేనట్లుగా రెచ్చిపోవడం చూసి వీళ్లసలు కాషాయ కార్పొరేటర్లా..కాషాయ గూండాలా అంటూ..హైదరాబాద్ ప్రజలు విస్తుపోతున్నరు.

- Advertisement -