- Advertisement -
కొన్రాడ్ సంగ్మా ఈరోజు (మార్చి6) మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కొన్రాడ్ సంగ్మాకు కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఈశాన్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనుగడ కొనసాగిస్తుందన్న వాదన ఉండేది, కానీ ఆ అభిప్రాయాన్ని బీజేపీ మార్చేసిందని ఆయన అన్నారు.
కొన్రాడ్ సంగ్మాకి చెందిన NPP పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకుంది. కాగా..బీజేపీ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది.
- Advertisement -