టీజర్‌: ది విజన్ ఆఫ్ భరత్..

222
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ‘ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో టీజర్‌ను కొద్ది సేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు.

Mahesh Babu The Vision of Bharat

ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ఆయన చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. ప్రస్తుత విద్యా విధానం.. దానిని ఓ యువ ముఖ్యమంత్రి ఏ విధంగా మార్చాడు అనే దానిపై సినిమా నడుస్తుందున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పక భారీ విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

- Advertisement -