సీఎం కేసీఆర్ భరోసా ధైర్యాన్నినింపిందిఃకల్నల్ సంతోష్ బాబు భార్య

735
santhosh babu wife
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కుటుంబానికి ఇచ్చిన భరోసా ధైర్యాన్నినింపిందన్నారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరం ఆమె మంత్రి జగదీష్ రెడ్డి తో కలసి మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి లకు రుణపడి ఉంటామని సంతోషి పేర్కొన్నారు.

భర్తను కొల్పయి పుట్టెడు దుఃఖం లో ఉన్న మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా మనో ధైర్యాన్ని పెంచిదన్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తమ ఇంటికి రావాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అహ్హనించడం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు సంతోష్ బాబు కుటుంబసభ్యులు.

- Advertisement -