కోల్‌కతా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు స్పందించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా.. కోల్ కతా ఘటనపై ప్రకటన చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రపతి కేవలం ఘటనపై మాట్లాడటమే కాకుండా ఇతర ఘటనలపై కూడా స్పందించాలని సూచించారు.
జన్మాష్టమి నాడు ఫరక్కాబాద్‌లో ఇద్దరు దళిత బాలికలు ఉరికి వేలాడుతూ కనిపించిన ఘటనపైనా ఇదే స్దాయిలో రాష్ట్రపతి ప్రస్తావించాలని అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఈ ఘటనపై మనమందరం పెదవివిప్పడం కీలకమని చెప్పారు.
మహారాష్ట్రలో బద్లాపూర్, రత్నగిరి, పుణే, కొల్హాపూర్ సహా పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపైనా మాట్లాడాలని కోరారు. ఈ ఘటనలన్నీ కూడా దేశాన్ని షాక్‌కు గురిచేసినవేనని …జోధ్‌పూర్‌లో నిన్న జరిగిన ఘటన కూడా అందరి హృదయాలనూ కలిచివేస్తోందని అన్నారు.
Also Read:వైసీపీకి ,ఎంపీ పదవికి మోపిదేవి-మస్తాన్ రావు రాజీనామా