జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్?

52
- Advertisement -

ఏపీలో వైసీపీ టార్గెట్ గా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసిందా ? పూర్వ వైభవం కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలో కూడా సత్తా చాటెందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 2014 తరువాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన చాలా మంది ఇతర పార్టీలలోకి షిఫ్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు మెల్లగా ఇతర పార్టీల నుంచి సొంత నేతలను తిరిగి కాంగ్రెస్ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా వైసీపీలోని నేతలపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీలో పూర్తి ప్రక్షాళనపై దృష్టి పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో టికెట్లు దక్కవనే టెన్షన్ లో ఉన్న నేతలకు కాంగ్రెస్ గాలం వేసే పనిలో ఉన్నట్లు టాక్..

ఇప్పటికే కొంతమంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపుకు వలసలు పెరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళేందుకు సుముఖత చూపిస్తునట్లు టాక్. ఎందుకంటే వైసీపీలోని మెజారిటీ నేతలు గతంలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చినవారే. అందువల్ల కాంగ్రెస్ పై అభిమానం ఉన్న చాలామంది నేతలు తిరిగి హస్తం పార్టీ గురికి చేరిన ఆశ్చర్యం లేదనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. ఇక ప్రస్తుతం ఏపీలో వైసీపీ మరియు టీడీపీ జనసేన కూటమి మద్యనే అసలు పోటీ నెలకొంది. అందువల్ల కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమౌతున్నాయి. మరి వైసీపీ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:స్కిప్పింగ్ తో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -