Bihar:7గురుపై కాంగ్రెస్‌ సస్పెన్షన్‌ వేటు

3
- Advertisement -

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలతో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) ఏడుగురు కీలక నాయకులను ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు మరియు క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కఠిన చర్య తీసుకున్నారు.

సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ సేవాదళ్ మాజీ ఉపాధ్యక్షుడు ఆదిత్య పాశ్వాన్బీ,పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షకీలూర్ రెహమాన్‌,కిసాన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ శర్మ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ రాజన్‌,బీసీ శాఖ మాజీ అధ్యక్షుడు కుందన్ గుప్తాబంకా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కాంచన కుమారి,నలంద జిల్లాకు చెందిన రవి గోల్డెన్‌ ఈ ఏడుగురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే, పార్టీలోని మరో వర్గం ఈ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ఓటమికి నిజంగా బాధ్యులైన సీనియర్ నాయకులను బాధ్యత నుండి కాపాడటానికి, బలిపశువులను చేసే విధంగా ఈ ఏడుగురిపై వేటు వేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సస్పెన్షన్ బీహార్ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో మరింత గందరగోళానికి దారితీసింది.

Also Read:Delhi AQI:తీవ్రస్థాయికి గాలి నాణ్యత

- Advertisement -