తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆయన అపోలో ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా రావటంతో ఆయన అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలకు కరోనా సోకుతుండటంతో మిగతా నేతలు అలర్ట్ అయ్యారు.
తమ టూర్లను రద్దు చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. అభిమానులు,కార్యకర్తలు తమను కలవడానికి రావద్దంటూ సందేశం పంపిస్తున్నారు. కాగా తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల‌్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగం పెంచటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7072కేసులు నమోదయ్యాయి.