శ్రీదేవి హఠాన్మరణంపై సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైన విషయం తెలిసందే. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు శ్రీదేవి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అయితే కాంగ్రెస్ ట్వీట్ పై నెటిజన్లు పండిపడుతున్నారు. శ్రీదేవి మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తోందని ఆగ్రహానికి లోనయ్యారు నెటిజన్లు.
శ్రీదేవి మరణ వార్త పట్ల చింతిస్తున్నామని, ఆమె గొప్ప నటి అని కాంగ్రెస్ అధికారిక ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అదే ట్వీట్‌లో.. యూపీఏ హయాంలో.. ఆమెకు 2013లో పద్మశ్రీ దక్కిందని కాంగ్రెస్ పేర్కొనడమే పలువురు నెటిజన్లు ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది.
ఇక నెటిజన్ల ఆగ్రహాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఈ ట్వీట్‌లో యూపీఏ హయాంలో ఆమెకు అవార్డు దక్కిందన్న విషయాన్ని తొలగించింది.