జుహూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు..

153
Sridevi funeral today!

దివి నుంచి భువి దిగివచ్చిన అందాల తార శ్రీదేవి దివికేగిన విషయం విధితమే. గుండెపోటుతో దుబాయ్‌లో శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. లెజండరీ నటి హఠాన్మరణంతో యావత్తు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులంతా శ్రీదేవి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Sridevi funeral today!

నిన్న రాత్రి ఆమె దుబాయ్ లో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబై చేరుకోనుందని సమాచారం. జుహూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోగానే ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు చేరుకుంటున్నారు. తాము ఎంతగానో ఆరాధించిన అతిలోకసుందరిని చివరిసారి చూడాలని ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.