కాళేశ్వరం పక్కన పెట్టేందుకే ప్లాన్?

17
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాద్దాంతం చేస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట మీడియా సమావేశాల్లోనూ తరచూ కాళేశ్వరం ప్రాజెక్టును చర్చకు తీసుకొస్తోంది. కీలకమైన బడ్జెట్ ప్రతిపాదన సమయంలో కూడా ఆగమేఘాల మీద మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు యావత్ ఎమ్మెల్యేలనూ తీసుకొని వెళ్లారు సి‌ఎం రేవంత్ రెడ్డి. దీంతో అసలెందుకు కాళేశ్వరంపై కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందనే సందేహాలు రాకమానవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కాలేశ్వరాన్ని పక్కన పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అనే డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. .

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లోపాలను సరి చేయడానికి రూ.2 లక్షల కోట్లు దాటుతుందని, దానిపై ఖర్చు చేసే ప్రతి రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యాలను బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమత్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి కనబరచడం లేదనేది కొందరి అభిప్రాయం. అయితే కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల తాగునీరు హైదరాబాద్ కి, మరో 10 టీఎంసీల నీరు గ్రామాలకు, 16 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడతాయి. మరి ఇంత ప్రయోజనకరంగా ఉండే కాలేశ్వరాన్ని పక్కన పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది చరిత్రాత్మక తప్పిదం అవుతుందని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.

Also Read:ఆరోపణలు నిరూపిస్తే..అసెంబ్లీకి రాను:హరీష్

- Advertisement -