ఏపీపై కాంగ్రెస్ ప్లాన్ అదే!

48
- Advertisement -

తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెడుతోంది. ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో ఎలాగైనా పూర్వ వైభవం దక్కించుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. పార్టీలో ఉండే అరకొర నేతలంతా ఇతర పార్టీలలోకి షిఫ్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీలో బలపడాలంటే తిరిగి గ్రౌండ్ వెవెల్ లో పార్టీని ప్రజలకు దగ్గర చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే ఏపీపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో సెన్సిటివ్ టాపిక్ అయిన ప్రత్యేక హోదా నినాదంతో రాష్ట్రంలో పాగా వేయాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. .

2014లో ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రత్యేక హోదా అంశం మరుగున పడుతూ వచ్చింది. అయితే ఏపీలోని ప్రధాన పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని పలుమార్లు ప్రస్తావించినప్పటికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఇక అందరూ ప్రత్యేక హోదా అంశాన్ని లైట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని కాంగ్రెస్ చెబుతోంది.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కూడా ఇదే హామీని ప్రకటించారు. ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ.. ఏపీ కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్రత్యేక హోదా అంశం మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీనే.. తాము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెబుతుండడంతో ప్రస్తుతం కాంగ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి ఏపీలో బలపడాలని భావిస్తున్న హస్తంపార్టీ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకొని ఏపీలో బలపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -