- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ సిఫార్సు లేఖల్ని తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబు రెండు ప్రాంతాలు.. తనకు రెండు కళ్లని చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ లేఖలపై తిరుమల దర్శనాల విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని.. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలకు కొండపై కనీసం రూమ్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
తెలంగాణ ఒక కన్ను ఆంధ్ర ఇంకో కన్ను అని మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక కన్ను తీసేసుకున్నారా? అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలంలో ఆంధ్ర నాయకులు ఇచ్చే లేఖలకు అనుమతి ఉందని.. అక్కడ దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
Also Read:Laddakh: భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం
- Advertisement -