ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం ప్రారంభమైంది. ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఇటీవల ఏఐసీసీ పునర్వ్యవస్థీకృత కమిటీలో కొత్త కార్యవర్గ సభ్యులు నియమితులైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మరోవైపు, బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో కొత్త నేతలకు అవకాశమిచ్చేలా సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు సూచించే అవకాశం ఉంది.
మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం , భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.
Also Read:సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్