గుంటూరు మిర్చి యార్డు సందర్శన సందర్భంగా తన భద్రతపై మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను పరామర్శించడానికి వచ్చిన తనకు సీఎం చంద్రబాబు కనీసం పోలీస్ భద్రత కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు.
ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, తాము అధికారంలోకి వచ్చాక ఇలా చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామని జగన్ స్పష్టం చేశారు.
మద్దతు ధర లేక మిర్చి రైతులు పడుతున్న అవస్థలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మిర్చి పంటకు కనీసం రూ.10 వేలు కూడా రావడం లేదు.. వైసీపీ హయాంలో క్వింటాకు రూ.27 వేలకు పలికితే ఇప్పుడు రూ.10 వేలకు కూడా కొనే పరిస్థితి లేదు అన్నారు. మిర్చి ఒక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.. రాష్ట్రంలో రైతు బతకడమే కష్టంగా మారిందన్నారు.
Also Read:జీబీఎస్ అంటువ్యాధి కాదు..!

