విపక్షాల దుమ్ముదులిపిన కేసీఆర్‌…

205
kcr
- Advertisement -

అపోజిషన్‌ పార్టీల దుమ్ముదులిపిండు సీఎం కేసీఆర్‌. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏం ఏం జేసిందో మొత్తం చెప్పుకుంటనే ప్రతిపక్ష పార్టీల కుట్రలు, కుతంత్రాలు అన్ని బయటపెట్టిండు. నిజామాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఉతికి ఆరేశారు.
చంద్రబాబుతో పొత్తు కలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా చెబుతున్నారని మండిపడ్డారు.

“థూ.. మీ బతుకులు చెడ.. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. వందల మంది తెలంగాణ బిడ్డలను ఎన్ కౌంటర్లలో చంపిండో.. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు” అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ఉద్యమ కాలం నాటి తన ప్రసంగంలోని వాడీవేడీని చూపించారు. ప్రతిపక్షాలపై పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. ప్రతి పథకం.. ప్రతి ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అడ్డుతగిలి… కేసీఆర్ గద్దె దిగు అని డిమాండ్ చేస్తూ వచ్చాయని… తిక్కరేగి తాను అసెంబ్లీ రద్దు చేస్తే… ఇప్పుడు కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాయని అన్నారు.

ఈ చిల్లర ఒర్రుడెందుకు … ఎన్నికలకు రండి అంటే గోడలు గీకుతున్నారని ఫైరయ్యారు. అధికారమిస్తే ఇంటి కిరాయిలు కడతామన్న బీజేపీ నేత లక్ష్మణ్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేసీఆర్.

ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. ఎవడైతే గుండు కొట్టిండో… ఎన్ కౌంటర్లల్ల వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో… తెలంగాణ ద్రోహి..చెడిపోయి…. చంద్రబాబుతో పొత్తా? థూ మీ బతుకులు చెడ… మీ బతుకుల్లల్ల…. అడుక్కుంటే మేం ఇస్తామయ్యా నాలుగు సీట్లు. కరెంట్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. మళ్లా ఆంధ్రోళ్లకు అప్పగిస్తరా అధికారం?.. అని తిట్టిపోశారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ స్పీచ్‌లో పదునైన డైలాగులతో సభికులతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నవ్వుల జల్లుల్లో మునిగిపోయారు.

- Advertisement -