పత్తా లేని చెయ్యి…

187
- Advertisement -

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ జాడలేకుండా పోతోంది. 2014నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఘోరాపరాజయం పాలైంది. అప్పటినుంచి కొలుకోలేకుండా పోతుంది. దేశంలోనే గాకుండా రాష్ట్రాల్లో కూడా తన ప్రాభల్యంను కోల్పోతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కాంగ్రెస్‌కు పత్తా లేకుండాపోతోంది.

ప్రతి ఎలక్షన్‌లో కాంగ్రెస్‌కు మూడవస్థానం లేదా డిపాజిట్‌ గల్లంతు. దానికి తగ్గ కారణాలను వెతుక్కోకుండా ఒకరికినొకరు పొట్లాడుకుంటూ ఉంటే కాంగ్రెస్‌ ఎలా గెలుస్తోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ చతికిలబడిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీలో ఉద్దండులు ఉన్న ప్రచారంకు రాకపోవడం పెద్ద సమస్య. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనున కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండే నల్గోండను గులాబీ పార్టీకి దారదత్తం చేశారు. మునుగోడు అభ్యర్థి పాల్వయి స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయింది.

మొదటి రౌండ్‌ నుంచే కాంగ్రెస్‌ కేవలం వందల్లో ఓట్లు రావడంతోనే స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 8వరౌండ్‌నుంచి కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా రాకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 14వ రౌండ్‌ వరకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు మొత్తంగా 23243ఓట్లు మాత్రమే వచ్చాయి. మరీ భవిష్యత్‌ కార్యచరణ ఏవిధంగా ఉండబోతుందో భవిష్యత్‌ చెప్పనుంది.

ఇవి కూడా చదవండి..

ప్రజలంతా కేసీఆర్‌ వెంటే:హరీశ్‌

నల్గొండ…గులాబీ కంచుకోట

బీజేపీకి వ్యతిరేక పవనాలు..

- Advertisement -