- Advertisement -
సినిమా డైలాగ్లు థియేటర్ వరకే బాగుంటాయి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ పుష్ప సినిమా రప్పా రప్పా డైలాగ్ పై మండిపడ్డారు పవన్. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి అన్నారు.
సినిమాలో చెప్పే డైలాగ్లు సినిమా హాల్ వరకే బాగుంటాయి.. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్నారు.
ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలి అని… శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అని స్పష్టం చేశారు.
Also Read:Suriya 45: మాస్ టైటిల్..కరుప్పు
- Advertisement -

