డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు..

13
vh

రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ నేతలు , మాజీ ఎంపీ వీహెచ్ , మాజీ మంత్రి సాంబాని చంద్రశేఖర్ , మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఖమ్మం జిల్లా పాల్వంచ వనమా రాఘవ కేసు విషయంలో డిజిపి ని కలిశారు. అరెస్ట్ చేయడమే కాదు…నిందితున్ని కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. వనమా రాఘవ పై నిర్భయ కేసు కూడా నమోదు చేయాలన్నారు.

గ్యాంగ్ స్టార్ నాయిమ్ ని రాఘవ మించిపోయాడన్నారు. నిందితునికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికి కౌన్సెలింగ్ ఇవ్వాలి…ఈ కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ను A1 నిందితుడిగా చేర్చాలన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని నిందితున్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.