రేవంత్-ఈటల చీకటి ఒప్పందం.. కాంగ్రెస్ నేతలు ఫైర్..

49

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం హస్తం పార్టీలో కాకరేపుతోంది. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే హుజూరాబాద్‌ ఉపఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసాడని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించి హుజురాబాద్‌లో సొంతపార్టీని పూర్తిగా దెబ్బకొట్టాడని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

హుజురాబాద్ టికెట్ కోసం 18 మందితో రూ. 5 వేలు డిపాజిట్లు కట్టించుకుని, దరఖాస్తులు చేయించుకుని, దామోదర రాజనర్సింహ టీమ్‌తో కసరత్తు చేయించి.. తీరా ఎన్నికల టైమ్‌లో అసలు దరఖాస్తే చేసుకోని పక్క జిల్లాకు చెందిన బలమూరి వెంకట్‌కు టికెట్ వచ్చేలా రేవంత్ రెడ్డి కుట్రలు చేశాడని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.. కేవలం తన రహస్య మిత్రుడు ఈటల గెలుపు కోసం తమను మోసం చేయడమే కాకుండా… ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న బలమూరి వెంకట్ లాంటి యువనేతను బలిపశువును చేస్తున్నాడని రేవంత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం గుస్సా అవుతున్నారు.

కాగా హుజురాబాద్‌లో ఆల్రెడీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల కూడా ఈ నెల 8న నామినేషన్ వేయగా.. ఆ పార్టీ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా 8న నామినేషన్ వేశారు. కాగా హుజురాబాద్‌లో తమను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈటలను గెలిపించాలన్న రేవంత్ కుట్రలకు స్థానిక కాంగ్రెస్ నేతలు చెక్ పెట్టబోతున్నారని సమాచారం.