ఏపీలో కొత్తగా 629 కరోనా కేసులు నమోదు..

31

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా అతి తక్కువ కేసులు నమోదౌతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,818 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 797 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 20,56,628 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,34,244 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,134 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,250కి పెరిగింది.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో.. చిత్తూరు జిల్లాలో 104 కేసులు వెల్లడి కాగా, మిగతా అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 91, కృష్ణా జిల్లాలో 75, నెల్లూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు గుర్తించారు.