‘మా’ ఎన్నికలకు సర్వం సిద్ధం..

23

అక్టోబర్ 10న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. దీని కోసం జూబ్లీ హిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 3గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒకగదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశముంది. దానికి తగ్గట్టుగానే పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక పోలీసు బందోబస్తు కోసం 3 ప్లాటూన్ల బలగాల్ని వినియోగిస్తున్నారు. ఇందులో ఒక మహిళా ప్లాటూన్ కూడా ఉంది. మా ఎన్నికలు సందర్బంగా.. విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో మొత్తం 883 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.