కాంగ్రెసోళ్ళు అంటే కాంగ్రెసోళ్లే!

78
- Advertisement -

అధికారంలోకి రాకముందు నానా హడావిడి చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ అనడం మొదటి నుంచి కాంగ్రెస్ అనుసరించే విధానమే. ప్రజా శ్రేయస్సు కంటే పదవుల గురించే ఆ పార్టీలో గొడవలు జరుగుతుంటాయి. తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆ పార్టీలో సాగిన రగడ తెలియంది కాదు. మైర్ అలాంటి పార్టీ అధికారంలోకి రావడానికి ఒక్కటే కారణం.. ఆ పార్టీ ప్రకటించిన ఆయా హామీలే. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ప్రకటించి వాటిని ఎలాగైనా అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే  కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల అదనపు ఖర్చు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తెలిసి కూడా హామీలు ప్రకటిస్తూ వచ్చారు.

అయితే ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ హామీలను నమ్మిన ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దాంతో రాదనుకున్న అధికారం రావడంతో ఇప్పుడు ఆ హామీల అమలు కాంగ్రెస్ కు తీవ్ర తలనొప్పిగా మారింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగా అమలు చేయగలదా అంటే డౌటే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ జాప్యం చేస్తూనే వచ్చింది. ఇంకా ఆరు గ్యారెంటీ హామీల విషయంలో కూడా ఆయా పథకాలపై పరిమితులు విధిస్తోంది. దీంతో కాంగ్రెస్ పై ప్రత్యర్థి పార్టీలు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు పలికిన వ్యాఖ్యలను.. ఎన్నికల తరువాత వారు మాట మార్చిన తీరును పోల్చుతూ తెలంగాణ బీజేపీ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. మాట మార్చడం కాంగ్రెసోళ్ళ నైజాం అంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -