కామారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

3
- Advertisement -

కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేనీ సందీప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గతంలో బీఆర్‌ఎస్ నుండి సస్పెండైన ఇందుప్రియను కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ.. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్పించారని గుర్తుచేశారు. మహిళగా గౌరవించి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తు చేశారు. అలాంటి నాయకుడిపైనే ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేయడం ఆమె నీచ రాజకీయాలకు నిదర్శనమని సందీప్ ధ్వజమెత్తారు.

షబ్బీర్ అలీపై ఇందుప్రియ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇందుప్రియపై షబ్బీర్ అలీ మద్దతుదారులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

- Advertisement -