కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్టుగా భావిస్తున్నామన్నారు. భారత సైనిక దళాల పనితీరు విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని ఆ దళాలు అసాధారణ రీతిలో పనిచేస్తున్నాయని…వాళ్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. దిగ్విజయ్‌వి అర్ధరహిత వ్యాఖ్యలు అని రాహుల్ అన్నారు.
దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల కన్నా పార్టీ అభిప్రాయాలు చాలా విలువైందన్నారు. సోమవారం భారత్ జోడో యాత్ర సందర్బంగా దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్‌పై చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. 2016లో యూరీ ఘటనకు బదులుగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. మరియు 2019లో పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌పై దాడికి ప్రతిగా బాలాకోట్‌లో భారత వైమానిక దళాలు ఎయిర్ స్ట్రైక్ ద్వారా వైమానిక దాడులు చేసింది.
ఇవి కూడా చదవండి…