30.56 కోట్లకు చేరిన కరోనా పరీక్షలు..!

46
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా టెస్టుల సంఖ్యను పెంచేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఇక ఇప్ప‌టివ‌రకు మొత్తం 30.56 కోట్ల‌కుపైగా శాంపిళ్ల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌)

వెల్ల‌డించింది. ఆదివారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన 18,50,110 శాంపిళ్ల‌తో క‌లిపి దేశంలో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 30,56,00,187కు చేరింద‌ని తెలిపింది.

ఇక దేశంలో గత 24 గంటల్లో 3,29,942 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,29,92,517 పెరిగింది. కరోనా మహమ్మారితో మొత్తం 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు.