ఇదే సరైన సమయం:హరీశ్‌ రావత్‌

201
- Advertisement -

భారత పాక్‌ మధ్య నెలకొన్న ప్రతిస్టంభనను తొలిగించాలంటే పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హర్యానా మాజీ సీఎం హరీశ్‌రావత్‌ హితవు పలికారు. ప్రస్తుతం పాక్ బలహీన పరిస్థితిలో ఉందని ఆదేశం అక్రమంగా ఆక్రమించిన మన భూభాగాన్ని ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోగలమని చెప్పారు. ఈ విషయంను మోదీ తన అజెండాలో చేర్చుకోవాలని సూచించారు.

గతంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పీఓకేపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పీఓకే భారత్‌కు చెందిందని, సమయం వచ్చినప్పుడు వెనక్కు తెచ్చుకుంటామని గత నెల 30న చెప్పారు. పీఓకేపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలుచేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల స్పష్టంచేశారు.

పాకిస్థాన్‌ అక్రమ ఆక్రమణ నుంచి పీఓకేను విడిపించడం మన బాధ్యత. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము పార్లమెంటులో తీర్మానం చేశాం. ఇప్పుడు, మోదీ ప్రభుత్వం తన అజెండాలో దీనిని కూడా చేర్చాలి. ప్రస్తుతం పాక్‌ బలహీనమైన స్థితిలో ఉంది. దీంతో పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని రావత్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి…

కేఏ పాల్ – షర్మిల..దొందూ దొందే!

రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట..

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు..

- Advertisement -