కాంగ్రెస్ నేత వినూత్న నిరసన..!

214
congress
- Advertisement -

ఓ వైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకోగా మరోవైపు టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలు రెబల్స్‌గా బరిలో దిగుతుంటే మరికొంతమంది వినూత్నంగా నిరసన గళం విప్పుతున్నారు. ఔరంగబాద్‌ లోక్ సభ స్ధానం నుండి టికెట్ ఆశీంచి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ గాంధీభవన్‌లో ఉన్న కుర్చీలన్నింటినీ తీసుకెళ్లిపోయారు.

సిల్లోడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ సుభాష్‌ జంబాద్‌కు ఆ టికెట్‌ను కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అబ్దుల్‌ సత్తార్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన అనుచరులతో కలిసి వెళ్లి 300 కుర్చీలను తీసుకువెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న పార్టీ వర్గాలు సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చాయి.

కాంగ్రెస్‌ సమావేశాల కోసం తాను సమకూర్చిన కూర్చిన కూర్చీలు వెనక్కి తెచ్చుకున్నా.. టికెట్‌ వచ్చిన వారే ప్రచార కార్యక్రమాల కోసం, పార్టీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా అందుకే తన సామాగ్రిని తానే తెచ్చుకున్నానని తెలిపారు. కాగా స్థానికంగా అబ్దుల్‌ సత్తార్‌కు మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు ఉంది. అనుచరగణం కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడటం కాంగ్రెస్‌కు షాకే.

- Advertisement -