నో డీల్.. షర్మిలకు దెబ్బేసిన కాంగ్రెస్!

41
- Advertisement -

ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని, కల్లబొల్లి మాటలతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల సరిగ్గా ఎన్నికల ముందు ప్లేట్ పిరాయించింది. పాదయాత్రలు పర్యటనలు ఎన్ని చేసిన ప్రజల దృష్టి ఆకర్షించలేకపోవడంతో కాంగ్రెస్ వైపు అడుగులు వేసింది. తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి తన తదుపరి రాజకీయ భవిష్యత్ స్టార్ట్ చేయాలని భావించింది. ఇప్పటికే పార్టీ విలీనంపై ఎన్నో మార్పు హస్తం హైకమాండ్ తో చేర్చలు జరిపింది కూడా. అయితే మొదట శర్మిల రాక ను స్వాగతించిన హస్తం పార్టీ ఇప్పుడు అసలు ఆమెను పట్టించుకోవడమే మానేసినట్లు తెలుస్తోంది. .

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్ ద్వారా అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికి ఆశించిన స్థాయిలో సానుకూలత కరువైంది. అయితే మొదట శర్మిల రాకను స్వాగతించిన హస్తం పార్టీ.. ఇప్పుడేందుకు వెనుకడుగు వేస్తోందంటే విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. 10-15 సీట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలకు కేటాయించాలని శర్మిల డిమాండ్ చేస్తున్నారట. అంతేకాకుండా తనకు పాలేరు సీటు కావాలని ఖరాఖండీగా చెబుతున్నారట.

Also Read:వరుస భేటీలు.. కాంగ్రెస్ తేల్చేడెప్పుడు?

దాంతో అధిస్థానం శర్మిల విషయంలో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పైగా శర్మిల టి కాంగ్రెస్ లో చేరడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో శర్మిల పార్టీలో చేర్చుకోకపోవడమే మంచిదనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు టాక్. దీంతో శర్మిల కూడా చేసేదేమీ లేక ఒంటరిగానే బరిలో దిగే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగితే ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఆమె పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవనేది కొందరి అభిప్రాయం. అందుకే ఎటు తేల్చుకోలేక ఆమె సైలెంట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఇక ఈ రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఎన్నికల దగ్గర పడడంతో శర్మిల డెసిషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:బెయిలా,కస్టడీనా.. టెన్షన్ లో టీడీపీ?

- Advertisement -