Revanth Reddy:ఆ ఐదుగురిపై ఫోకస్!

48
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీలన్నితమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఎన్నికల సమరంలో ఇప్పటికే అధికార పార్టీ ముందజంలో ఉంది. 115 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుండగా కాంగ్రెస్ సైతం మరికొద్దిరోజుల్లోనే ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు రెడీ అవుతోంది. అయితే బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలు ప్రకటించిన తర్వాతే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ప్రధానంగా కాంగ్రెస్ విషయానికొస్తే బీఆర్ఎస్‌లో సీటు ఆశించి భంగపడ్డ నేతలు హస్తం వైపు చూస్తున్నారు. అలాగే బీజేపీలోని ప్రధాన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు రేవంత్ అండ్ కో. ఇందులో భాగంగా తొలుత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పైకి ఈ ఇద్దరు నేతలు ఖండిస్తూ వస్తున్న అన్ని అనుకున్నట్లు జరిగితే వీరు హస్తం గూటికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:నల్లజామతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..?

అలాగే బీజేపీ సీనియర్ లీడర్లైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా హస్తం కండువా కప్పునునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరికి ఓపెన్ టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివేక్‌కు చెన్నూరు అసెంబ్లీ లేదా పెద్దపల్లి ఎంపీ టిక్కెట్,రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి , యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్, ఏనుగు రవీందర్ రెడ్డికి ఎల్లారెడ్డి టిక్కెట్లపై స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి..

Also Read:Telangana Congress:ఫస్ట్ లిస్ట్ లీక్!

- Advertisement -