కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. మరింత లేట్?

50
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో టి కాంగ్రెస్ మొదటి జాబితా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా జరిపిన హస్తం పార్టీ.. ఇక అభ్యర్థులను ఫైనల్ చేయడంపై దృష్టి సారించింది. ఇక ఆయా సీట్లలో ఇప్పటికే చాలమంది నేతలు కర్చీఫ్ వేసుకోగా ఆశావాహులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పైగా చాలా నియోజిక వర్గాలలో కాంగ్రెస్ కు వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇంకా పార్టీలో కొంతమంది నేతల మద్య పాలేరు వంటి సీట్లపై కుమ్ములాట జరుగుతోంది..

ఈ నేపథ్యంలో స్క్రినింగ్ కమిటీ ఫైనల్ చేసే తొలి జాబితా అభ్యర్థులు ఎవరనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన అంశం. కాగా తొలి జాబితా అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నీ కసరత్తులు పూర్తయితే ఈనెల రెండో వారంలో జాబితా ప్రకటించే అవకాశాలు కనిపించాయి. కానీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణమేమిటంటే నియోజిక వర్గాల వారీగా ఆశించిన స్థాయిలో బలమైన నేతలు కనిపించకపోవడం ఒక కారణమైతే.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపు అడుగులు వేస్తుడడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో హస్తం పార్టీ ఫస్ట్ లిస్ట్ మరింత ఆలస్యం కానుందట. పార్లమెంట్ సెషన్స్ ముగిసిన తరువాత ఈ నెల చివరి వారంలో ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈలోగా పార్టీలో అసంతుప్త నేతలను బుజ్జగించడం, నియోజిక వర్గాల వారీగా మార్పులు చేర్పులపై దృష్టి పెట్టడం వంటివి టి కాంగ్రెస్ నేతలు చేయనున్నారు. మొత్తానికి ఫస్ట్ లిస్ట్ పై నానా హంగామా చేస్తూ వచ్చిన హస్తం పార్టీ.. తాజా పరిణామాల దృష్ట్యా తొలి జాబితాపై కన్ఫ్యూజన్ లో పడినట్లు తెలుస్తోంది.

Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో

- Advertisement -