ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ది పసలేని వాదన..!

384
uttam kumar reddy
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్ శరవే గంగా పూర్తవుతుంటే కాంగ్రెస్ నాయకులకు కన్నుకుడుతుంది. అందుకే ప్రాజెక్టులపై పస లేని వాదన తెరమీదకు తెస్తూ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి మాటలను పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు ప్రజలు.

ఎందుకంటే సమైఖ్య రాష్ట్రంలో సాగు,తాగు నీటి గోసలు అంతా ఇంత కావు. తలపునే గోదారి ఉన్న మన చేను,చేలక ఎడారినే తలపించేది. పంట నీళ్ళకోసం బోర్లు వేసివేసి నీరు పడక చివరకు బోర్ల రాంరెడ్డిగా మారిన వెతల కథలు ఎన్నెన్నో. నీళ్ళ కోసం తెలంగాణ నిరంతర యుద్ధం చేసింది.

తెలంగాణ తలరాత మారాలంటే స్వరాష్ట్రం రావాలని ప్రజల కన్నీటిగోసను పల్లె పల్లెకు తీసుకెళ్లి వివరించిన నాటి ఉద్యమనేత,నేటి అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్..తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణను కరువు రక్కసి నుండి బయటపడేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. రికార్డు స్ధాయిలో దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు పూర్తికాని విధంగా పూర్తిచేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. ఫలితంగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా రికార్డు స్ధాయిలో పంట ఉత్పత్తులతో తెలంగాణ ధాన్యాగారంగా మారింది.

దీంతో ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పెద్ద మనుషులు ప్రాజెక్టులపై విషప్రచారానికి శ్రీకారం చుట్టారు.
నాడు గోదావరి జలా ల్లో తెలంగాణ వాటా 954 టీఎంసిలు ఉంటే కాంగ్రెస్ వాటిని ఏ రోజు వినియోగించేందుకు ప్రయత్నించక పోగా, ఆంధ్రా ప్రాంతానికి మా త్రం నీటిని తరలించేందుకు సహకరించారు.

స్వరాష్ట్రాన్ని పాత రెట్టి, పక్క ప్రాంత ప్రాజెక్టులకు మాత్రం మంగళ హారతులు పట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై అడుగడుగునా మోకాలడ్డే ప్రయత్నం చేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వందల కేసులు వేశారంటే తెలంగాణ రైతులపై కాంగ్రెస్ నేతలకు ఉన్న ప్రేమ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టిన ప్పుడు భూసేకరణ తప్పక జరుగుతుంది. ఆ భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లిస్తూ వాళ్ళను ఒప్పిస్తుంది ప్రభు త్వం. ఇప్పుడు నీతులు చెప్పుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు మిడ్ మానేర్ నిర్వాసితులకు డబ్బు లు చెల్లించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలిసిందే. అరకోర చెల్లింపులు చేపట్టి అవికూడా కాళ్ళకు చెప్పులరిగేలా తిరిగినా రాని పరిస్థితి. అందుకే ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌ను ఛీ కొడుతూ.. ప్రజలు టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నా వారికి మాత్రం కనువిప్పు కలగడం లేదు.

- Advertisement -