కాంగ్రెస్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

23
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుదో అందరికి తెలిసిందే. రాష్ట్రంలో రోజు రోజుకు పడిపోతున్న ఆ పార్టీ గ్రాఫ్ హైకమెండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకురావలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు హస్తం నేతలు. పార్టీలో నేతల మద్య కొనసాగుతున్న ఆదిపత్య పోరును పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నప్పటికి సరైన విధంగా ఆధారణ లభించడం లేదని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హత్ సే హత్ జోడో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పటికి ఊహించినంత మైలేజ్ మాత్రం రావడం లేదు.

ఎందుకంటే ఇంకా సీనియర్ వర్సస్ రేవంత్ రెడ్డి ఎపిషోడ్ కొనసాగుతూనే ఉంది. రేవంత్ పాదయాత్రలో సీనియర్ నేతలు ఎవరు కనిపించడం లేదు. దాంతో రేవంత్ పాదయాత్ర కాస్త చప్పగానే సాగుతోంది. ఈ అంతర్గత విభేదాల కారణంగా రేవంత్ రెడ్డి కూడా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ విధానాలను ముందుకు తీసుకెళ్లలేక పోతున్నారు. ఇదిలా ఉంచితే రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 72 స్థానాలను కైవసం చేసుకోబోతుందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, సింగిల్ గానే బరిలోకి దిగుతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితి చూస్తే ఆ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగే సాహసం చేస్తుందా అనే ప్రశ్నలు రాక మానవు.

ఎందుకంటే రాష్ట్రంలో హస్తం పార్టీ బలం చాలావరకు తగ్గిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే మునుగోడులో హస్తం పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక చేతులెత్తేసింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఏ స్థాయిలో బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 72 సీట్లు తమవే అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు పూర్తిగా సద్దుమణిగితేనే తప్పా హస్తం పార్టీకి పూర్వవైభవం రాదని కొందరి వాదన. మరి 72 సీట్లు మావే అంటున్న కాంగ్రెస్ పార్టీది కాన్ఫిడెన్సా ? లేదా ఓవర్ కాన్ఫిడెన్సా ? అనేది వచ్చే ఎన్నికలతో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి…

తెలంగాణ…5జీ సేవలున్న పట్టణాలు

తెలంగాణ గ్రామీణం దేశానికి ఆదర్శం :కేటీఆర్‌

బక్ముత్ దిశగా రష్యా సేనలు..!

- Advertisement -