భారత్‌ జోడో యాత్రలో సోనియా ప్రియాంక

22
- Advertisement -

కాంగ్రెస్‌కు పూర్వ జవసత్వాలు తేవడానికి ప్రయత్నిస్తున్న ఎంపీ రాహుల్‌ జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర…త్వరలో కర్ణాటకలో ప్రారంభం కానుంది. రాహుల్‌ గాంధీతో పాటు పలువురు నేతలు వివిధ వర్గాల సామాన్య ప్రజలు కూడా ఈ యాత్రలో పయనమవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా త్వరలో యాత్రలో పాల్గొంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. అయితే కర్ణాటకలో జరిగే ఈ యాత్రలో నేతలిద్దరూ పాల్గొంటారని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకూమార్‌ తెలిపారు.

సెప్టెంబర్‌ 30న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశిస్తుందని దసరా సందర్బంగా రెండ్రోజులు యాత్రకు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. యాత్రలో సోనియా గాంధీ ఒకరోజు ప్రియాంక వాద్రా మరో రోజు యాత్రలో పాల్గొంటారని….అయితే వాటి తేదీలు ఇంకా ఖరారు కాలేదని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

- Advertisement -