కాంగ్రెస్‌, బీజేపీల నీచరాజకీయం..

25
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒక్కటయ్యాయా? పైకి మావి జాతీయ పార్టీలు..మా సిద్ధాంతాలు వేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలు పార్టీలు తెలంగాణలో మాత్రం లోపాయికారి ఒప్పందంతో ముదుకు సాగుతున్నాయా? అంటే పరిస్థితులను చూస్తే అవుననే తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో, సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చేసిన విశృంకలత్వమే దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చు.

ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో నీచరాజకీయానికి తెరలేపి… ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి.. ఉద్రిక్తతలను సృష్టించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటయ్యాయి. దీంతో సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ పార్టీని ఇబ్బందిపెట్టే దుష్టరాజకీయం చేసేందుకు చేతులు కలిపాయి. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ కేవలం డ్రాఫ్ట్ దశలో ఉందని మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రకటించినా.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించాలని మంత్రి కేటీఆర్‌ స్వయంగా అధికారులకు చెప్పినప్పటికీ… కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తూ.. వారిని రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ప్రయత్నించాయన్నది ముమ్మాటికి నిజం.

రైతు ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రవేసుకున్న కేసీఆర్‌ సర్కార్‌పై ఆ రెండు పార్టీలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజానుకూల కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టి, సర్కార్‌ పై ఉసిగొల్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దురాశతో కాంగ్రెస్‌; బీజేపీ పార్టీలు చీకట్లో దోస్తి చేస్తున్నాయనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

చండూరు ను అద్దంలా తీర్చిదిద్దుతా : కేటీఆర్‌

ఏపీ బీజేపీ గ్రూప్ వార్.. !

భారతదేశానికి దిక్సూచి తెలంగాణ:కేటీఆర్‌

- Advertisement -