బీజేపీ కాంగ్రెస్ మధ్య ‘మేనిఫెస్టో వార్’ !

38
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే.. పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి కొంతమంది అభ్యర్థుల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇరు పార్టీలు కూడా మేనిఫెస్టో పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అభివృద్దే ప్రదాన లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు టాక్. ఈ మేనిఫెస్టోకు మోడీ హామీ లేదా భారత్ 2047 పేర్లను పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..

అభివృద్దితో పాటు ఉద్యోగ రూపకల్పన, పేదరిక నిర్మూలన వంటి అంశాలను కూడా మేనిఫెస్టో ప్రస్తావించే అవకాశం ఉందట. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటునట్లు టాక్. పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో ను రూపొందించి అభివృద్ది, సంక్షేమం.. ఇలా అన్నీ అంశాలను ప్రస్తావిస్తూ గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు బీజేపీ గానీ ఇటు కాంగ్రెస్ గాని మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ప్రకటించబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కాంగ్రెస్ రేపు ( 5న ) మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్. ఆ తర్వాత మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రచారంపై దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్ళేలా హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారట. అటు బీజేపీ కూడా వీలైనంత త్వరగా మేనిఫెస్టోను ప్రకటించి మోడీ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట కమలనాథులు. పైగా ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉండడంతో మేనిఫెస్టోపై మరింత కేర్ తీసుకొనున్నట్లు తెలుస్తోంది, మరి ఏ పార్టీ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిస్తుందో చూడాలి. ఇక వచ్చే నెల 13న తొలిదశ పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Also Read:Congress:ఎన్నికల వేళ మరో షాక్..

- Advertisement -