టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు..

86
trs
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు,రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీల నుండి భారీగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ దరిపల్లి శ్రీనివాస్, పట్టణ బీజేపీ మైనార్టీ అధ్యక్షుడు హిందీ ఇబ్రహీం అలాగే సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు కృష్టపురం బాబు, వారి అనుచరులు సుమారు 100 మందితో కలిసి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన నివాసం వద్ద టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు కుటుంబ సభ్యునిలా చుసుకుంటామని.. అందరికీ ప్రధాన్యం ఉంటుందన్నారు.

- Advertisement -