కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయిః మంత్రి కేటీఆర్

420
ktr medaram jathara
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తూనే పైకి డ్రామాలు ఆడుతున్నాయన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఇవాళ మంత్రి కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్ధానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం అన్నారు. మున్సిపల్ మంత్రి ఇది నాకు సవాల్ అని అన్నారు. రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్‌బండ్‌లు నిర్మాణం చేశాం. హైదరాబాద్‌ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామన్నారు.

రూ.18 వేల కోట్లతో 2 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు మాపై విశ్వాసం ఉంది. సీఎం కేసీఆర్‌ మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలున్నాయి..త్వరలోనే వాటిని కూడా అమలు చేస్తారు. ఐదు రూపాయల భోజనాన్ని మాజీ మంత్రి జానారెడ్డి తిని మెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు సమయం ప్రకారమే జరుగుతాయన్నారు.

- Advertisement -