Congress:ఆరు గ్యారెంటీలు.. డౌటే?

61
- Advertisement -

తెలంగాణలో అధికారం కోసం ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ, వివిధ సమావేశాల్లోనూ, బహిరంగ సభల్లోనూ హస్తం నేతలు ఆ ఆరు గ్యారెంటీలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఏదైనా శృతిమించితే అనర్థమే అనే నానుడి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆరు హామీల విషయంలో హస్తం నేతలు చేస్తున్న హడావిడి శృతిమించుతోందా అంటే అవునని చెప్పక తప్పదు. అసలు ఎన్నికలు రాక ముందే ఆల్రెడీ అధికారంలోకి వచ్చినట్లుగా హడావిడి చేయడం, హామీలను ఆల్రెడీ అమలు చేస్తునట్లు పగటి కలలు కనడం వంటివి చేస్తున్నారు హస్తం నేతలు..

తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరు హామీలు అమలు చేస్తున్నమంటూ ఏకంగా బాండు పేపర్ పై సంతకం చేస్తూ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. ఇలా హస్తం నేతల హడావిడి చూస్తుంటే పైకి మాత్రమే చప్పుడు.. లోపలంతా డొల్ల అన్నట్లుగా ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆ మధ్య కర్ణాటకలో ఆరు హామీలనే ప్రదాన ఎజెండాగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఈ హామీలను నెరవేర్చుతోందా అంటే… ముమ్మాటికి లేదని ఆ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు.

మరి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పార్టీ.. తెలంగాణలో అధికారం కోసం చేస్తున్న హామీలను ఎంతమేర నిలబెట్టుకుంటుందనే డౌట్ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను మరియు తెలంగాణ రాష్ట్రాన్ని బేరీజు వేసుకొని చూస్తే తెలంగాణ 10 రేట్లు ముందంజలో కనబడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయని హామీలు తెలంగాణలో ఎంతవరకు అమలు చేస్తారనే ప్రశ్నలు హస్తం నేతలు తెల్లమొఖం వేసుకునే పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు ఉత్త మాటలే తప్పా వాటి అమలు జరగదనేది చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

- Advertisement -