అలియా డీప్‌ఫేక్ వీడియో.. రష్మిక రియాక్షన్!

29
- Advertisement -

ఇటీవల రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కాజోల్, సారా టెండూల్కర్‌‌ డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలియా భట్ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మొత్తానికి ఈ డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పట్లో ఆగేలా లేవు. హీరోయిన్లతో పాటు మిగిలిన ఆడవారి పై కూడా ఈ డీప్‌ఫేక్ సాంకేతికతను వాడుతున్నారు.

ఈ క్రమంలో మరోసారి డీప్‌ ఫేక్‌ వీడియోపై రష్మిక స్పందించింది. రష్మిక నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆమె తన డీప్‌ ఫేక్‌ వీడియో, ట్రోల్స్‌పై మాట్లాడింది. ‘నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే..మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నామం’ అంటూ రష్మిక మందన్నా కామెంట్స్ చేసింది.

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా రష్మిక మందన్నా చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ‘కొన్ని విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ నన్ను కట్టుకోబోయేవాడు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి. అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలి. అలాగే కాస్త ఫ్యామిలీ టైప్‌గా పద్దతిగా అందంగా ఉండాలి’ అని చెప్పుకొచ్చింది. అన్నట్టు రష్మిక మందన్నా ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

- Advertisement -