దేశంలోని కీలక రాష్ట్రాలైన కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అధికారికంగా ప్రకటించింది.
కేరళం అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది కాంగ్రెస్. ఈ జాబితాలో జాతీయ, రాష్ట్ర స్థాయి అగ్రనేతలు చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఈ జాబితాలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక గోవాలోని పోండా ఉపఎన్నికపై కూడా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ బైపోల్ ఎన్నికకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. ఆయన ప్రచారం గోవాలో పార్టీకి మద్దతు పెంచుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!
గోవాలో జరగనున్న ప్రచార కార్యక్రమాల్లో తెలంగాణకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు.

