బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై మోసం కేసు నమోదైంది. 2018లో రూ. 2-3 కోట్లతో తాను ఏర్పాటు చేసిన ‘బీయింగ్ హ్యూమన్ జువెలరీ’ బ్రాండ్ స్టోర్‌కు అవసరమైన సహాయ సహకారాలతోపాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, హామీ మేరకు వారి నుంచి తనకు ఎలాంటి సహకారమూ అందలేదని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్, అల్విరాఖాన్తోపాటు మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. కాగా ఈ కేసు విషయమై జూలై 13వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. అరుణ్ ఆరోపణలపై సరైన విచారణ చేపడుతున్నామని, ఒకవేళ వాళ్లపై నేరం రుజువైతే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.