థియేట‌ర్ల‌లోనే ‘లవ్ స్టోరీ’రిలీజ్..

18

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్‌ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే కొంతకాలంగా ల‌వ్ స్టోరీ ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది.

తాజాగా ఈ చిత్ర విడుద‌లపై స్పందించిన నిర్మాత సునీల్ నారంగ్ ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ మా చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌న్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు. జూలై 30న ల‌వ్ స్టోరీ సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చూడాలి. అతిత్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం.