బి‌ఆర్‌ఎస్‌కు సామాన్యులే అండ!

44
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ పై బురద చళ్లేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయా ? రాష్ట్ర ప్రజలే సైనికుల్లా బి‌ఆర్‌ఎస్ అండగా ఉన్నారా ? అంటే అవునని చెప్పక తప్పదు. గతంలో రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని డిల్లీ దొరలు.. ఓట్ల ముందు మాత్రం అంతా మాదే.. అంతా మేమే అని అన్న రీతిలో కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊసే లేని నేతలు ఇప్పుడు తెలంగాణపై కపట ప్రేమ కనబరుస్తున్నారు. అయితే ఇలా కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నలు ప్రజలు మాత్రం కే‌సి‌ఆర్ వెంటే మేమంటూ బి‌ఆర్‌ఎస్ కు అండగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయంలో తీవ్రమైన కరెంటు కోతల నుంచి రాష్ట్రనికి కే‌సి‌ఆర్ విముక్తి కల్పించారని దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ రైతులను ఆదుకుంటున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

కరెంట్ విషయం బి‌ఆర్‌ఎస్ పై కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసిన ప్రజలే వాటిని తిప్పి కొడుతున్నారు. ధరణి పోర్టల్ లో అవినీతి జరిగిందని చేస్తున్న విమర్శలకు ప్రజలే సమాధానం చెబుతున్నారు. గతంలో భూ రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొన్నా సమస్యలు అన్నీ ఇన్ని కావని.. దళారుల వ్యవస్థకు స్వస్తి చెప్పేలా కే‌సి‌ఆర్ ప్రవేశ పెట్టిన ధరణి వల్ల రైతుల భూములు పదిలంగా ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు ప్రజలే చెంపపెట్టులా సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కే‌సి‌ఆర్ గెలిపించుకుంటామని ప్రజలే నిక్కచ్చిగా తేల్చి చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ” onceagainKCR ” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు మాత్రం రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చిన కే‌సి‌ఆర్ కు అండగా ఉంటూ బి‌ఆర్‌ఎస్ కు నీరాజనం పలుకుతున్నారు.

Also Read:ఇప్పుడే ఇలా.. అధికారమిస్తే అరాచకమే!

- Advertisement -