బాబు గోగినేని, తేజ‌స్వీపై సంజ‌న హాట్ కామెంట్స్?

232
bigboss, sanjana
- Advertisement -

సెల‌బ్రెటీలంద‌రిని ఒకచోట‌కి తెచ్చి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ 2 స్టార్ట్ అయ్యి దాదాపు వారం రోజ‌లు గ‌డిచింది. 13మంది సెల‌బ్రెటీలు, 3 సామాన్యులు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి నుంచే పార్టిసిపెంట్ ల మ‌ధ్య గొడ‌వ‌లు కావడం మ‌నం చూస్తున్నాం. ఇక సామాన్యురాలిగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన సంజ‌న హౌజ్ లో అంద‌రితో ను గొడ‌వ పెట్టుకుంది. బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టడంతోనే జైలు జీవితం గడిపిన ఈ భామ అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

sanjana

ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగు చెందిన మిగ‌తా పార్టిసిపెంట్స్ సంజ‌న ను ఎలిమినేట్ చేయ‌మ‌ని చాలాసార్లు బిగ్ బాస్ ను వేడుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో తేజ‌స్వీనితో ప‌లుమార్లు గొడ‌వ పెట్టుకోవ‌డంతో ఆమెను సెల‌బ్రెటీలు కొంచెం దూరం పెట్టేశారు. దింతో ప‌లుకార‌ణాల‌తో సంజ‌న‌ను ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బిగ్ బాస్. దింతో పాటు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్ష‌కులకు కూడా ఆమె ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో సంజ‌న‌కు అతి త‌క్కువ ఓట్లు వేసి ఆమెను హౌజ్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు.

bigboss2

నిన్న రాత్రి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె హౌస్ లోని ప‌లువురిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. బాబు గోగినేని, తేజ‌స్వీనిపై మండిప‌డింది. బాబు గోగినేని బ‌య‌ట‌కు క‌నిపించే అంత మంచి వ్య‌క్తి కాద‌ని చెప్పింది. ఆయ‌నంటే నాకు ఇంత‌కుముందు చాలా గౌరం ఉండేద‌ని..ఇప్పుడు ఆయ‌న నిజ‌స్వ‌రూపం చూశాక ఆయ‌నంటే ఏంటో తెలిసింద‌న్నారు. ఇక తేజ‌స్వీ గురించి మాట్లాడుతూ ఆమెకి ప‌క్క‌వారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌ద‌న్నారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న త‌న‌కు నచ్చ‌లేద‌ని చెప్పారు. ఇక సంజ‌న స్ధానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం.

- Advertisement -