ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుః సాయి ధ‌ర‌మ్ తేజ్

196
sai dharam tej

మెగా ఫ్యామిలి నుంచి ఎంట్రీ ఇచ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి అల్లుడు సాయి ధ‌రమ్ తేజ్. కెరీర్ మొద‌ట్లోనే మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్లి స్టార్ డ‌మ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య కాలంలో తీసిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి. ఇక తేజ్ తాజాగా న‌టించిన చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. ఈ సినిమా జులై 6వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు చిత్ర‌బృందం.

tej i love u

క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు తేజ్. తేజ్ కు జంట‌గా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించింది. తాజాగా ఈమూవీ యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను కూడా మొద‌లు పెట్టేశారు. ఇటివ‌లే ఆడియో స‌క్సెస్ మీట్ ను కూడా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా తేజ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

tej-iloveu

తేజ్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లాప్ అవ‌డంతో ఆయ‌న‌తో సినిమా తీయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అయితే ప్రోడ్యూస‌ర్ కేఎస్ రామారావు ఆయ‌న‌ను న‌మ్మి ఈసినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అందుకోసం ఈసినిమా కు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూన‌రేష‌న్ తీసుకొలేద‌ట‌. షూటింగ్ కు సంబంధించిన చిన్న చిన్న ఖ‌ర్చులు త‌ప్ప ఆయ‌న ప్రోడ్యూస‌ర్ నుంచి అస‌లు డ‌బ్బులు తీసుకోలేని స‌మాచారం. సినిమా విడుద‌ల త‌ర్వాత మంచి టాక్ తో దూసుకుపోతే నిర్మాతే తేజుకి వాటా రూపంలో ఇవ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొడ‌తాన‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు తేజ్ ఐ ల‌వ్ యూ టీం.