దండుమల్కాపూర్‌లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఒకేసారి 51 పరిశ్రమలతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. 100 ఎకరాల్లో టాయ్స్‌పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలకు స్థలాల కేటాయింపు పత్రాలను అందజేయనున్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసిన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2019 తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్ (టీఐఎఫ్) ఆధ్వర్యంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసింది. 542 ఎకరాల్లో 400 పైగా పరిశ్రమలు వచ్చాయి. ఇక ఇవాళ ఉత్పత్తులు ప్రారంభించే పరిశ్రమల్లో రక్షణ పరికరాల తయారీ, సోడామిషన్ మేకింగ్, ఎర్త్ డ్రిల్లింగ్ ఎక్విఫ్‌మెంట్, మైనింగ్,బిస్కెట్లు, చాకెట్లు,కుర్‌కురే, పచ్చళ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బిల్డింగ్ మెటీరియల్స్, ప్యాకింగ్ బ్యాగులు, మిల్క్‌క్యాన్ల తయారీ, కేబుల్స్, సిమెంట్ బిక్స్, టెక్ట్స్‌బుక్కుల ప్రిటింగ్, పేవ్‌మెంట్ టైల్స్, మౌల్డింగ్ తయారీ, ప్యాకింగ్ ప్రిటింగ్, కూలర్ల బాడీ, పెట్రోల్ బంకుల నిర్మాణ పరిశ్రమ, ఆటోమేటిక్ రైస్ గ్రైడింగ్, ప్లాస్టింగ్ ప్యాకింగ్, మెటీరియల్, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, యూపీవీసీ విండోస్ పరిశ్రమలు ప్రధానంగా ఉన్నాయి.
Also Read:నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..
రూ.40 కోట్లతో నిర్మించిన ఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని 2021 జనవరి 22న శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాదిన్నరలోనే యుద్ధ్ద ప్రతిపాదికన పనులు చేపట్టి బహుళ అంతస్తులు నిర్మించారు. ఈ సెంటర్‌ను రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. రెండు భవనాలను ఐదు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. మొదటి బ్లాకు భనంలో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, అడిటోరియం, ఐలా, టీఫ్ కార్యాలయాలు, రెస్టారెంట్ల, బ్యాంకులను నిర్మాణం చేశారు. రెండో భవనంలో వస్తువులను ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక మార్కెట్‌తోపాటు, కార్యాలయాలు, వసతి గదులు, ఏర్పాటు చేశారు.
Also Read:ఉస్తాద్ కోసం భారీ సెట్టింగ్..