గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..ఎమ్మెల్సీ కవిత ఫైర్

74
- Advertisement -

గ్యాస్ సిలిండర్ ధరలుమళ్లీ పెంచడంపై కేంద్ర సర్కార్‌పై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు.

గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నదని విమర్శించారు.

- Advertisement -