కమెడియన్ వేణుమాధవ్‌ ఇంట విషాదం..

515
- Advertisement -

హాస్య నటుడు వేణుమాధవ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు (54) గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. కాప్రా హెచ్ బీ కాలనీలోని మంగాపురంలో నివాసముంటున్న విక్రమ్ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Comedian Venu Madhav

కొన్నిరోజుల క్రితమే విక్రమ్ బాబు కుమార్తె పెళ్లి జరిగింది. తన ఇంట శుభకార్యం జరిగిన కొన్నిరోజుల్లోనే ఆయన కన్నుమూయడం అందరినీ కలచివేసింది. ఈ సాయంత్రం లక్ష్మీనగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -