బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతుంది. దేశంలోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. దాంతో పాటు ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ముంబాయిలోని గోరేగావ్‌లో ఉన్న దాదాసాహెబ్ పాల్కే చిత్రాంగరి ఫిల్మ్ సిటీలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈసందర్భంగా కపిల్ శర్మ మాట్లాడుతూ…మనం మన కోసం కాదు..ఇతరుల కోసం కూడా అనే భావన నాలో కలిగించిందన్నారు. ఈ కార్యక్రమం నాకు ఎంతగానో నచ్చిందని నా మనసుని కదిలించిందని అన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఎంపీ తలపెట్టిన ఈ కార్యక్రమం ముందుకు సాగాలన్నారు. ఇదొక కార్యక్రమంలా కాకుండా బాధ్యతగా తీసుకుపపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. యావత్ దేశ ప్రజలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరుకుంటుకున్నట్టు తెలిపారు. నా షో వీక్షించే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని సూచించారు.
Also Read: అమెరికాకు ప్రధాని మోడీ..
ఎంపీ సంతోష్‌కుమారి పచ్చని ఆశయానికి అండగా నిలవాలని నా అభిమానులను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. వర్ష కాలంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Also Read: ఢిల్లీ పాలన స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీం